Rajanikanth: 'చంద్రముఖి' సీక్వెల్ పై రజనీ ఆసక్తి

  • సంచలన విజయాన్ని సాధించిన 'చంద్రముఖి'
  • సీక్వెల్ కి కథ రెడీ చేసిన దర్శకుడు వాసు 
  • త్వరలోనే పూర్తి వివరాల వెల్లడి
రజనీకాంత్ కథానాయకుడిగా 2005లో వచ్చిన 'చంద్రముఖి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ప్రభు సొంత నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆసక్తితో రజనీ వున్నారు.

తాజాగా ఇదే విషయాన్ని గురించి మురుగదాస్ ప్రస్తావించాడు. 'అసలు రజనీతో నేను 'చంద్రముఖి' సీక్వెల్ చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. అప్పుడు 'దర్బార్' సబ్జెక్ట్ లైన్లోకి వచ్చింది' అని అన్నాడు. ఇక మరోవైలు, దర్శకుడు పి.వాసు 'చంద్రముఖి' సీక్వెల్ కి కథను సిద్ధం చేశాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని చెబుతున్నారు. రజనీ ఈ సీక్వెల్ పై ఆసక్తిగా ఉండటం వలన, త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Rajanikanth
Vasu

More Telugu News