Sankranthi: సంక్రాంతికి సొంతూరుకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు

  • ప్రతి సంక్రాంతికి సొంతూరు వెళ్లే చంద్రబాబు
  • అమరావతిలో రైతుల ఆందోళనలతో తాజా నిర్ణయం
  • రైతులకు సంఘీభావంగా రాజధానిలోనే ఉండాలనుకుంటున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతి సంక్రాంతిని స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన సంక్రాంతి వేడుకలకు సొంతూరు వెళ్లరాదని నిర్ణయం తీసుకున్నారు. నారావారిపల్లెలో ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలకు నారా కుటుంబసభ్యులు, అటు నందమూరి కుటుంబసభ్యులు కలుసుకుని సందడి చేస్తుంటారు. అయితే, అమరావతిలో రైతులు ఆందోళనలు చేపడుతున్న తరుణంలో తాను సంక్రాంతి జరుపుకోవడం సబబు కాదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు సంక్రాంతికి స్వగ్రామం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకుని, రైతులకు మద్దతుగా అమరావతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
Sankranthi
Chandrababu
Naravaripalle
Nara Lokesh
Nandamuri

More Telugu News