kalyan Ram: సెన్సార్ పనులను పూర్తిచేసుకున్న 'ఎంత మంచివాడవురా'

  • మంచి మార్కులు కొట్టేసిన టైటిల్ 
  • క్లీన్ యు సర్టిఫికెట్ మంజూరు 
  • ఈ నెల 15వ తేదీన విడుదల
ఇటీవల కాలంలో గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలకు ఆదరణ పెరుగుతోంది. కుటుంబ వ్యవస్థతో ముడిపడిన ప్రేమకథలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. అదే తరహాలో రూపొందిన చిత్రమే 'ఎంత మంచివాడవురా'. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ - మెహ్రీన్ జంటగా నటించారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి క్లీన్ యు సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 15వ తేదీన విడుదల చేయనున్నారు. టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా సోషల్ మీడియాలో మంచి మార్కులు సంపాదించుకుంటూ వెళుతోంది. విడుదల తరువాత ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.
kalyan Ram
Mehreen

More Telugu News