Narendra Modi: కుటుంబ సభ్యులతో కలసి మోదీని కలసిన మోహన్ బాబు

  • ఢిల్లీకి వెళ్లిన మోహన్ బాబు
  • 35 నిమిషాల పాటు మోదీతో చర్చ
  • మోదీజీని కలిశామన్న మంచు లక్ష్మి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టాలీవుడ్ నటుడు మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు విష్ణు, కోడలు విరోనిక కలిశారు. కుటుంబ సభ్యులతో కలసి ఢిల్లీకి వెళ్లిన మోహన్‌ బాబు ఈ సందర్భంగా మోదీ అపాయింట్ మెంట్ తీసుకొని ఆయనను కలిశారు. దాదాపు 35 నిమిషాల పాటు మోదీతో పలు అంశాలపై చర్చించారు. 'జస్ట్ ఇప్పుడే మన డైనమిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని కలిశాము' అని మంచు లక్ష్మి ట్విట్టర్లో పేర్కొంది. కాగా, బీజేపీలో చేరాల్సిందిగా మోహన్ బాబును మోదీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
Narendra Modi
manchu laxmi
vishnu

More Telugu News