Amaravathi: అమరావతిని మార్చొద్దు.. విద్యా ర్థి జేఏసీ 'సేవ్ అమరావతి' బంద్!

  • మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు
  • నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం 
  • అణచివేత తీవ్రమైతే ఉద్యమం ఉద్ధృతం 

రాజధాని అమరావతిని మార్చవద్దని కోరుతూ 'సేవ్ అమరావతి' పేరుతో విద్యార్థి జేఏసీ గుంటూరు జిల్లాలో ఈ రోజు చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. జేఏసీ నేతలు గుంటూరు బస్టాండ్ వద్ద కళాశాలల బస్సులు నిలిపివేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అణచివేయాలని చూస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సంఘం ప్రతినిధులు హెచ్చరించారు.

Amaravathi
student JAC
Guntur District
bandh

More Telugu News