roja: 30 మంది వైసీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే రోజా అనుచరుల కేసు

షార్ట్స్‌లో చూడండి
తమ సొంతపార్టీ కార్యకర్తలపైనే వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా అనుచరులు కేసులు పెట్టారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్‌పురంలోకి రోజాను రానివ్వకుండా నిన్న సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్న విషయం తెలిసిందే.

వైసీపీ నాయకులను పట్టించుకోకుండా టీడీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పుత్తూరులోని పోలీస్ స్టేషన్‌లో రోజా అనుచరులు ఈ రోజు ఫిర్యాదు చేశారు. పర్యవసానంగా 30 మంది కేబీఆర్‌పురం వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు.
Go Back to Shorts
roja
YSRCP

More Telugu News