Kodali Nani: అమరావతి రైతులను చర్చలకు ఆహ్వానించిన కొడాలి నాని

  • చంద్రబాబును నమ్మి మోసపోవద్దు
  • న్యాయం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు
  • అమరావతి రాజధాని కాదని ఎవరన్నారు?
టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి అమరావతి ప్రాంత రైతులు మోసపోవద్దని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. లక్ష కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మించే బదులు... అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను కొంతమేర అభివృద్ధి చేస్తే ఢిల్లీ, హైదరాబాద్ నగరాలతో పోటీ పడుతుందని చెప్పారు. అమరావతి రైతులు చర్చకు రావాలని ఆహ్వానించారు. తమ డిమాండ్లను అమరావతి రైతులు వివరిస్తే... న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సరైన అవగాహన, డిమాండ్లతో వస్తే ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని అన్నారు. అమరావతి రాజధాని కాదని ఎవరన్నారని ప్రశ్నించారు.



Kodali Nani
Amaravati
Chandrababu
Jagan
Telugudesam
YSRCP

More Telugu News