రాజధాని రియల్ ఎస్టేట్ పైనే వంద తరాలకు సరిపడా సంపాదించాలని స్కెచ్ వేశాడు: బాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధానిపై ఆయన తీరు సరికాదంటూ ట్వీట్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

'అమరావతి ప్రాంత నేల స్వభావం, భౌగోళిక స్థితిగతులు భారీ నిర్మాణాలకు అనుకూలం కాదని  శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కమిటీ నివేదికపై చంద్రబాబు హేళనగా మాట్లాడాడు. వంద తరాలకు సరిపడా రాజధాని రియల్ ఎస్టేట్ పైనే సంపాదించాలని స్కెచ్ వేశాడు. మూడు ప్రాంతాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు' అని విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh

More Telugu News