Telugudesam: దళిత అధికారులపై వైసీపీ నేతల దాడులు దారుణం: నారా లోకేశ్

  • ములకల చెరువు ఎంపీడీఓ రమేశ్ పై దాడి హేయం
  • తప్పుడు పనులకు సహకరించలేదని దాడులు చేస్తారా?
  • వైసీపీ దాడులను ఖండిస్తున్నా
ఎన్నో కష్టాలు అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దళిత అధికారులపై వైసీపీ దాడులకు దిగడం దారుణమని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు ఎంపీడీఓ రమేశ్ పై వైసీపీ నేతల దాడి హేయమైన చర్య అని, గ్రామాల్లో వైసీపీ నాయకుల అరాచకాలు తార స్థాయికి చేరుకున్నాయని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. తప్పుడు పనులకు సహకరించాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, సహకరించని వారిపై వైసీపీ నేతలు దుర్భాషలాడుతూ, దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారులకే రక్షణ లేనప్పుడు ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? అని ప్రశ్నించారు.
Telugudesam
Nara Lokesh
Mulakala cheruvu
mpdo

More Telugu News