BJP: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను కలిసిన జేసీ దివాకర్ రెడ్డి

  • వైసీపీ సర్కారుపై అసంతృప్తితో ఉన్న జేసీ
  • జాతీయపార్టీలతోనే దేశాభివృద్ధి అంటూ వ్యాఖ్యలు
  • రాజధానిగా అమరావతే ఉండాలని ఆకాంక్ష
తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని భావిస్తున్న టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురంలో ని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన సత్యకుమార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత తగ్గిపోతోందని అభిప్రాయపడ్డారు. కొన్ని విషయాల్లో మోదీకి జై అనాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తున్నట్టు చెప్పారు. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగవుతాయని జోస్యం చెప్పారు.
BJP
Andhra Pradesh
Sathyakumar
JC Diwakar Reddy
Telugudesam
YSRCP
Jagan

More Telugu News