Kesineni Nani: చరిత్ర హీనులు కావద్దు: సీఎం జగన్‌కు కేశినేని నాని సూచన

  • అమరావతి రాజధాని కోసం ప్రజలంతా పోరాటం చేస్తున్నారు
  • చంద్రబాబుపై కోపంతో రాజధానిని మార్చడమేంటీ
  • జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమరావతి రాజధాని కోసం ప్రజలంతా పోరాటం చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఉన్న కోపంతో జగన్.. రాజధానిని మార్చడమేంటీ? అని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ నిర్ణయంపై ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని కేశినేని నాని ఆరోపించారు.  రాజధానికి ద్రోహం చేసి చరిత్ర హీనులుగా మారొద్దని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు. కాగా, అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Kesineni Nani
Vijayawada
Amaravati
Telugudesam

More Telugu News