Air India: ఎయిర్ ఇండియా ఎన్నటికీ మూత పడబోదు: ఎండీ అశ్వినీ లోహానీ

  • ఎయిర్ ఇండియాపై వార్తలు వదంతులే
  • సంస్థ సేవలు కొనసాగుతాయి
  • ట్విట్టర్ లో ఎండీ వ్యాఖ్యలు
ప్రభుత్వ రంగ పౌర విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మూతపడనుందని వస్తున్న వార్తలన్నీ వదంతులేనని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశ్వినీ లోహానీ వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా ఎప్పటికీ మూత పడబోదని, సంస్థ సేవలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు ఎవరికీ ఆందోళన వద్దని ఆయన భరోసాను ఇచ్చారు.

ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆయన, ప్రపంచంలో ఇప్పటికీ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియానేనని అయన తెలిపారు. కాగా, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గట్టున పడేయాలని భావిస్తున్న ప్రభుత్వం, కొంత వాటాను విక్రయించాలని ప్రయత్నించి, విఫలమైన సంగతి తెలిసిందే. ఇక సంస్థను పూర్తిగా విక్రయించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరో ఆరు నెలల్లో సంస్థను ఎవరికైనా విక్రయించకుంటే, విమాన సర్వీసులు నడిపించడం కూడా కష్టమవుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు.
Air India
MD
Ashwani Lohani

More Telugu News