Chiranjeevi: మహేశ్ బాబు ఫంక్షన్ కు వెళుతున్న మెగాస్టార్... మరెవరినీ పిలవబోనన్న బన్నీ!

  • మరెవరినైనా పిలిస్తే చిరంజీవి స్థాయి తగ్గుతుంది
  • ఎవరినీ పిలవవద్దని నిర్మాతలకు చెప్పిన బన్నీ
  • గెస్ట్ లేకుండానే కార్యక్రమం నిర్వహించనున్న నిర్మాతలు
తాను హీరోగా నటించిన కొత్త సినిమా 'అల వైకుంఠపురములో...' మ్యూజిక్ కాన్సర్ట్ కు గెస్ట్ గా ఎవరూ వద్దని అల్లు అర్జున్ స్పష్టం చేసినట్టు సమాచారం. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళుతున్నారు.

ఇదే సమయంలో జరగనున్న' అల వైకుంఠపురములో' ఈవెంట్ కు చిరంజీవిని మించిన గెస్ట్ లేని కారణంగా, ఎవరూ వద్దని బన్నీ చెప్పాడట. చిరంజీవిపై ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో మరే గెస్ట్ నూ ఆహ్వానించవద్దని దర్శక, నిర్మాతలకు అల్లు అర్జున్ చెప్పారట. మరెవరినైనా పిలిస్తే, చిరంజీవి స్థాయి తగ్గినట్లవుతుందని బన్నీ అనుకున్నాడట. దీంతో ఎవరినీ పిలవకుండానే కార్యక్రమం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Chiranjeevi
Mahesh Babu
Allu Arjun
Ala Vaikunthapuramulo

More Telugu News