Revanth Reddy: కేసీఆర్ ప్రాణాలకు కేటీఆర్ నుంచి ముప్పు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • కేసీఆర్ కుటుంబంలో పదవి చిచ్చు
  • తనను సీఎం చేయాలని కోరుతున్న కేటీఆర్
  • ఇవ్వకుంటే ఏదైనా జరగవచ్చన్న రేవంత్
కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు అనుక్షణం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని, కేసీఆర్ ను దించి వేయాలని ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు మాట్లాడుతున్నారని గుర్తు చేసిన ఆయన, ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో భారీ చీలిక వచ్చిందని, కేసీఆర్ ఇంట్లో అర్థరాత్రి పూట ఏమైనా జరగవచ్చని, అల్లుడి నుంచి ముప్పు తగ్గిందని, కుమారుడు కేటీఆర్ నుంచి ఆయనకు ముప్పు ఉందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంట్లోనే కేటీఆర్ ఉంటున్నారని, ఆయన్ను ఆ ఇంటి నుంచి పంపించి వేయాలని అన్నారు.

తాజాగా హైదరాబాద్, కర్మన్ ఘాట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం పదవి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. కేటీఆర్ సీఎం పదవిని ఆశిస్తున్నారని, వెంటనే ఆయనకు పదవిని ఇవ్వకుంటే ఏదైనా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేటీఆర్ ను ప్రగతి భవన్ నుంచి వెంటనే ఖాళీ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కు భద్రతను మరింత పెంచాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy
KTR
KCR

More Telugu News