Telugudesam: బెదిరింపులకు భయపడను..ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి: జేసీ దివాకర్ రెడ్డి

  • బెయిల్ పై విడుదలైన జేసీ దివాకర్ రెడ్డి
  • వ్యక్తిగత కక్షతోనే నన్ను 8 గంటలు  స్టేషన్ లో ఉంచారు
  • వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోంది 
ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చారు. అనంతరం, తనను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత కక్షతోనే తనను ఎనిమిది గంటల పాటు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని మండిపడ్డారు.

పోలీస్ అధికారులపై ఏదో రిమోట్ పనిచేస్తోందని విమర్శించారు. టీడీపీ నేతలను భయపెట్టేందుకే తనను అన్ని గంటలపాటు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెట్టి పాలన చేయాలని చూస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వాన్ని మోదీ బర్తరఫ్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telugudesam
Jc
Diwaker reddy
Government

More Telugu News