Thamannah: బాలకృష్ణ సినిమాకి నో చెప్పిన తమన్నా?

  • బోయపాటితో బాలకృష్ణ 
  • తమన్నాతో సంప్రదింపులు 
  • ఫిల్మ్ నగర్లో ఇదే హాట్ టాపిక్  
కెరియర్ ను ఆరంభించిన కొద్ది కాలంలోనే తమన్నా అగ్రస్థాయికి దూసుకెళ్లింది. వరుస సినిమాలతో .. వరుస విజయాలతో తన సత్తా చాటుకుంది. ఆ మధ్య తమన్నా జోరు కాస్త తగ్గినా, 'ఎఫ్ 2' సినిమా నుంచి ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంది. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో భారీ విజయాన్నే అందుకుంది. చిరంజీవితో భారీ సినిమా చేసిన ఆమెకి తాజాగా బాలకృష్ణ సరసన చేసే ఛాన్స్ లభించింది.

బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం తమన్నాను అడిగారట. అయితే ఈ ఆఫర్ ను తమన్నా సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ సినిమాకి నో చెప్పేంత బిజీగా అయితే తమన్నా లేదు. మరి అలాంటప్పుడు ఆమె నో చెప్పడానికి కారణం ఏమైవుంటుందా? అనేది హాట్ టాపిక్  గా మారింది.
Thamannah
Balakrishna
Boyapati

More Telugu News