Mahesh Babu: మహేశ్ కి ఫ్లాప్ ఇచ్చాను .. అయినా నన్ను ఆప్యాయంగా పలకరిస్తాడు: దర్శకుడు మురుగదాస్

  • 'స్పైడర్' పరాజయం బాధించింది
  • మనసున్న మనిషి మహేశ్ బాబు
  • ఆయనలోని ప్రత్యేకత అదే
మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'దర్బార్' సినిమా నిర్మితమైంది. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నయనతార కనిపించనుంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి మాట్లాడిన మురుగదాస్, మాటల్లో మహేశ్ బాబు ప్రస్తావన తీసుకొచ్చాడు.

"మహేశ్ బాబుతో చేసిన 'స్పైడర్' సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికీ నన్ను ఆ విషయం బాధిస్తూనే ఉంటుంది. సాధారణంగా ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడిని హీరోలు పెద్దగా పట్టించుకోరు. కానీ మహేశ్ బాబు నన్ను ఇప్పటికీ ఆత్మీయంగా పలకరిస్తుంటాడు. ఆయనలో వున్న ప్రత్యేకత అదే. మహేశ్ బాబు రంగు మాత్రమే తెలుపు కాదు .. ఆయన మనసు కూడా తెలుపే" అని చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే త్వరలో ఆయన మహేశ్ బాబుతో మరో మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగానే అనిపిస్తోంది.
Mahesh Babu
Muruga Doss

More Telugu News