Puvvada Ajay: తెలంగాణ మంత్రి పువ్వాడకు చేదు అనుభవం

  • తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
  • సమావేశానికి వస్తుండగా పువ్వాడను తనిఖీ చేసిన పోలీసులు
  • తీవ్ర అసహనానికి గురైన మంత్రి
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. సాక్షాత్తు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఇది ఎదురుకావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ భవన్ లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి హాజరుకావడానికి పువ్వాడ వస్తుండగా... ఆయనను ఆపిన పోలీసులు తనిఖీ చేశారు. పోలీసుల చర్యతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మంత్రిని అని చూడకుండా తనిఖీ చేస్తారా? అని మండిపడ్డారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
Puvvada Ajay
TRS

More Telugu News