Hardik Pandya: ప్రేమలో ఉన్నారని తెలుసు కానీ నిశ్చితార్థం చేసుకుంటారని తెలియదు: హార్దిక్ పాండ్య తండ్రి

  • గాళ్ ఫ్రెండ్ తో హార్దిక్ పాండ్య నిశ్చితార్థం
  • నిశ్చితార్థం తర్వాత తమకు తెలిసిందన్న తండ్రి
  • నటాషా మంచి అమ్మాయి అంటూ కితాబు
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తన సెర్బియన్ గాళ్ ఫ్రెండ్ నటాషా స్టాంకోవిచ్ (బాలీవుడ్ నటి) తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై హార్దిక్ తండ్రి హిమాన్షు పాండ్య స్పందించారు. నటాషా చాలా మంచి అమ్మాయని, ఆమె కుటుంబంతో తమకు పరిచయం ఉందని తెలిపారు. చాలాసార్లు ఆమెను తమ కుటుంబసభ్యులు కలిశారని వివరించారు. త్వరలోనే హార్దిక్, నటాషాల పెళ్లి ఉంటుందని చెప్పారు. హార్దిక్, నటాషా ప్రేమలో ఉన్న సంగతి తమ కుటుంబసభ్యులందరికీ తెలుసని, కానీ నిశ్చితార్థం చేసుకుంటారని తెలియదని అన్నారు. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తమకు తెలిసిందని వెల్లడించారు.
Hardik Pandya
Natasha Stankovic
Bollywood
Himanshu

More Telugu News