TRS: ప్రారంభమైన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగుతున్న భేటీ
  • మునిసిపల్ ఎన్నికలకోసం వ్యూహ రచన
  • హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వ్యూహ రచనకోసం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగుతున్న ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం.

TRS
Party meet
Telangana

More Telugu News