Tirumala: పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటాం: టీటీడీ ఈవో సింఘాల్

  • హైకోర్టు సూచనల మేరకు రేపు నిర్ణయం తీసుకుంటాం
  • రేపు సాయంత్రం మండలి అత్యవసర సమావేశం  
  •  ఏకాదశి  ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం
తిరుమల ఆలయంలో ఉత్తరద్వార దర్శనం నిమిత్తం పదిరోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరవాలన్న హైకోర్టు సూచనల మేరకు రేపు నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు పాలక మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏకాదశి  ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, 85 వేల మందికి పైగా భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తామని, భక్తుల సేవలో మూడు వేల మంది శ్రీవారి సేవకులు, 1300 మంది స్కౌట్ సిబ్బంది పాల్గొంటారని చెప్పారు.
Tirumala
Eo
Anilkumar singhal
Vaikunta dwaralu

More Telugu News