jc divakar reddy: అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి

  • పోలీసులతో బూట్లు నాకిస్తానని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు 
  • జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడి ఫిర్యాదు 
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు  
పోలీసులతో బూట్లు నాకిస్తానని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఈ రోజు అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ ఫిర్యాదు మేరకు ఆయనపై ఇటీవల పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

కాగా, సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని న్యాయస్థానం ఆయనకు షరతులు విధించింది. రాష్ట్ర పోలీసులకు జేసీ దివారక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కడప జిల్లా పోలీసు అధికారుల సంఘం ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.  
jc divakar reddy
Andhra Pradesh
Anantapur District

More Telugu News