Andhra Pradesh: 'ఏపీ రాజధాని' పోరాటంలో రైతు మల్లికార్జునరావు మృతి

  • అమరావతి రాజధాని గ్రామాల్లో కొనసాగుతోన్న నిరసనలు
  • దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతుకు గుండెపోటు
  • 17 రోజులుగా రాజధాని కోసం ఆందోళనల్లో పాల్గొన్న రైతు
నిన్న మందడంలో మహిళలపై పోలీసుల తీరుకి నిరసనగా అమరావతి రాజధాని గ్రామాల్లో ప్రజలు బంద్‌ పాటిస్తున్నారు. దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆయన మృతికి రాజధాని రైతులు నివాళులర్పించారు.


తుళ్లూరు, ఉండవల్లి, మందడం ప్రాంతాల్లో రైతులు నిరసన ప్రదన్శనలు కొనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కొన్ని చోట్ల టెంట్‌ వేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డుపైనే అందోళనను కొనసాగిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh
Amaravati

More Telugu News