Priyamani: 'నీలాంబరి' తరహా పాత్రలో నటించాలనుంది: హీరోయిన్ ప్రియమణి

  • కథానాయికగా ప్రియమణికి మంచి గుర్తింపు 
  • 'అసురన్' తెలుగు రీమేక్ లో అవకాశం
  • అప్పుడే 17 ఏళ్లు గడిచిపోయాయన్న ప్రియమణి
తెలుగులో కథానాయికగా ప్రియమణి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలోను కథానాయికగా ఆమె కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల తోను .. రియాలిటీ షోలతోను ఆమె బిజీగా వుంది. తెలుగులో రీమేక్ కానున్న 'అసురన్' లో కథానాయికగా ఆమె ఎంపికైంది.

అలాంటి ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."నటిగా వెండితెరకి పరిచయమై 17 ఏళ్లు అయింది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే సంతోషంగానే వుంది. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా 'మీ డ్రీమ్ రోల్ ఏమిటి?' అని అడుగుతున్నారు. 'పడయప్పా' (నరసింహా)లో రమ్యకృష్ణ పోషించిన 'నీలాంబరి' తరహా పాత్రను చేయాలనుంది. నా వాయిస్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలకి బాగుంటుందని అంతా అంటుంటారు. అందువలన ఆ తరహా పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
Priyamani
Ramyakrishna

More Telugu News