Vijay Sai Reddy: భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటికొస్తున్నాయి: విజయసాయిరెడ్డి

  • ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు కొట్టేశారు
  • పరువు నష్టం దావా వేస్తామంటున్నారు
  • దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండంటున్నారు
  • సీబీఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి
ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటికొస్తున్నాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు గుప్పించారు. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. 'సీఐడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది' అంటూ సవాలు విసిరారు.
 
'విక్రమార్కుడు-భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు. రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నాడు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు అర్థమవుతుంది. కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చూస్తుంటాడు' అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ లో విమర్శలు గుప్పించారు.
Vijay Sai Reddy
Andhra Pradesh

More Telugu News