Jagan: రైతులపై జగన్ గారికి ఇంత కక్ష ఎందుకో అర్థం కావట్లేదు: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

  • అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపారు
  • భయభ్రాంతులకు గురిచేసి ఏమి సాధించాలనుకుంటున్నారు? 
  • అర్ధరాత్రి రైతుల ఇళ్లలో సోదాలా? 
రైతులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసి ఏమి సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి రైతుల ఇళ్లలో సోదాలా? అని నిలదీశారు.
 
రాజధాని కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్ గారి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ చెప్పారు. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు జగన్ గారు అంటూ హితవు పలికారు.
Jagan
Nara Lokesh
Viral Videos

More Telugu News