Ntr: ఎన్టీఆర్ గుండుతోనూ కనిపిస్తాడంటూ టాక్!

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • రీసెంట్ గా జరుగుతున్న ప్రచారం
  • జూలై 30న ప్రేక్షకుల ముందుకు
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా, కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నాడు. పాత్ర పరంగా ఆయన ఈ సినిమాలో తలపాగాతో కనిపిస్తాడు. అయితే ఒకానొక సందర్భంలో .. కొన్ని నిమిషాల పాటు ఆయన గుండుతోనూ కనిపిస్తాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోంది.

ఈ వార్తను కొంతమంది కొట్టిపారేస్తుండగా, ఈ కథలో కల్పితం కూడా ఉందని రాజమౌళి చెప్పడం వలన ఎన్టీఆర్ గుండుతో కనిపించే అవకాశం లేకపోలేదని మరికొందరు అంటున్నారు. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం కావడం వలన, ఎన్టీఆర్ అందుకు అంగీకరించి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయవలసిందే.
Ntr
Charan

More Telugu News