New Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్‌’తో పొత్తుపై కాంగ్రెస్ స్పష్టత

  • వేర్వేరుగా బరిలోకి దిగనున్న ఆప్, కాంగ్రెస్
  • పొత్తు ఉండబోదని స్పష్టం చేసిన ఇరు పార్టీలు
  • త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్
ఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరేంటో బయటపెట్టింది. రానున్న ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాశ్ చోప్రా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని ఆప్ ఇప్పటికే తేల్చి చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ తాజా ప్రకటన చేసింది. తాము ఒంటరిగానే పోటీ చేసి అవసరమైన మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సుభాశ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది.
New Delhi
AAP
Congress
Elections

More Telugu News