Andhra Pradesh: ప్రభుత్వ దన్నుతోనే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు: సుజనాచౌదరి

  • అమరావతిలో మహిళల ఆందోళన
  • పోలీసుల లాఠీచార్జి
  • అమానుషం అంటూ ఖండించిన సుజనా
ఏపీ రాజధాని అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం నిరసన ప్రదర్శనలో పాల్గొన్న రాజధాని మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని విపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. రాజధానిలో మహిళలపై దాడులు అమానుషం అని వ్యాఖ్యానించారు.

మహిళలపై జగన్ ప్రభుత్వ దమనకాండను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిపై పోలీస్ వ్యాన్ నడపడం అరాచకత్వానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ప్రభుత్వ దన్నుతోనే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని సుజనా మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Amaravati
Farmers
Women
Police

More Telugu News