Gutta Jwala: గుత్తా జ్వాల అకాడమీ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

  • అకాడమీ ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల
  • అకాడమీ కోసం వెబ్ సైట్ ఏర్పాటు
  • శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల హైదరాబాదులో అకాడమీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ అకాడమీ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను కూడా రూపొందించారు. ఓ కార్యక్రమంలో గుత్తా జ్వాల అకాడమీ వెబ్ సైట్ ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్వాలతోపాటు ఆమె తల్లిదండ్రులు, నగర మేయర్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ వెబ్ సైట్ ను ప్రారంభించిన అనంతరం జ్వాలను అడిగి అకాడమీ విశేషాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా, నగరం నుంచి అనేకమంది ఔత్సాహిక క్రీడాకారులను చాంపియన్లుగా మలచాలంటూ జ్వాలకు విషెస్ తెలిపారు. అకాడమీని హైదరాబాదులో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Gutta Jwala
Badminton
Aacademy
Telangana
Hyderabad
Website

More Telugu News