Amaravathi: రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడం హేయమైన చర్య: చంద్రబాబు

  • శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీస్ జులుం చేస్తారా?
  • రైతులపైకి పోలీస్ వాహనాలు నడిపి గాయపరుస్తారా?
  • ఇవన్నీ అప్రజాస్వామిక చర్యలు
రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడం హేయమైన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసుల జులుం సబబు కాదని, రైతులపైకి పోలీస్ వాహనాలు నడిపి వారిని గాయపర్చడం అప్రజాస్వామికమని అన్నారు. రైతులు, మహిళలపై బనాయించిన కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రభుత్వానికి సూచించారు.
Amaravathi
Mandam
Chandrababu
Telugudesam

More Telugu News