Chandrababu: చంద్రబాబు తన వాళ్ల భూముల విలువ పెంచేందుకు కోతలెన్నో కోశాడు: ఎంపీ విజయసాయిరెడ్డి

  • ఇన్ సైడర్ ట్రేడింగులో బాబు తరఫు వాళ్లు భూములు కొన్నారు
  • రాజధాని గురించి చేసిన హడావుడి అంతాఇంతా కాదు
  • యూ-టర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు, విమర్శల పర్వం ట్వీట్ల ద్వారా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా, ఈరోజు వరుస ట్వీట్లు చేశారు. నాడు ఇన్ సైడర్ ట్రేడింగులో తన వాళ్లు కొనుగోలు చేసిన భూముల విలువ పెంచడానికి, రాజధాని గురించి చంద్రబాబు చేసిన హడివుడి అంతా ఇంతా కాదని అన్నారు.

 హైపర్ లూప్ రవాణా, బులెట్ ట్రెయిన్ కనెక్టివిటీ, ఒలంపిక్స్ నిర్వహణ, అక్కడ నివసించే వారి ఆయుష్షు పదేళ్లు పెంచడం లాంటి నమ్మశక్యం కాని కోతలెన్నో కోశాడంటూ బాబుపై విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పరు అని, చంద్రబాబు ఏమో ఇచ్చిన మాటపై నిలబడరని విమర్శించిన విజయసాయి, యూ-టర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరని తెలుసుకోలేకపోవడం ఆయన కర్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  
Chandrababu
Telugudesam
YSRCP
Vijayasaireddy

More Telugu News