Jagan: మహిళలపై మీ ప్రతాపం చూపించడం దారుణం జగన్ గారూ!: లోకేశ్ విమర్శలు

  • అమరావతిలో లాఠీచార్జి
  • స్పందించిన లోకేశ్
  • నిరంకుశత్వ పాలనకు నిదర్శనం అంటూ ఆగ్రహం
ఇచ్చిన మాటపై నిలబడాలని డిమాండ్ చేసిన అక్కాచెల్లెళ్లపై లాఠీచార్జి చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై మీ ప్రతాపం చూపించడం దారుణం జగన్ గారూ అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో పోలీసులు మహిళల గొంతు నొక్కి ఈడ్చుకెళ్లిన ఘటన జగన్ గారి నిరంకుశత్వ పాలనకు నిదర్శనమని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మడమ తిప్పకండి అని మహిళలు అడగడం తప్పా? అంటూ నిలదీశారు. లాఠీలతో ఉద్యమాలను అణచివేయాలనుకున్న నియంతలు ఎక్కడ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని లోకేశ్ ట్వీట్ చేశారు.
Jagan
Andhra Pradesh
Amaravati
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News