diveneni: జీఎన్ రావు ఇచ్చిన నివేదికనే బోస్టన్ సంస్థ కూడా ఇస్తుంది: టీడీపీ నేత దేవినేని ఉమ

  • బోగస్ కమిటీలు వేసి రాజధాని తరలించాలనుకుంటున్నారు
  • అమెరికాలో ఆ సంస్థ ఉంది
  • అమరావతిపై అవగాహన ఎలా ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై బోస్టన్ సంస్థ రూపొందించిన నివేదిక నేడు సీఎం జగన్‌కు అందనుంది. అనంతరం ఈ నెల 8న జరిగే కేబినెట్ భేటీలో బోస్టన్ సంస్థ నివేదికపై మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నివేదికలపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బోగస్ కమిటీలు వేసి రాజధానిని తరలించాలని చూస్తున్నారని అన్నారు. జీఎన్ రావు ఇచ్చిన నివేదికనే బోస్టన్ సంస్థ కూడా ఇస్తుందని చెప్పారు. అమెరికాలో ఉన్న బోస్టన్ సంస్థకు అమరావతిపై అవగాహన ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. అమరావతిలో ప్రజల గురించి ఆ సంస్థకు ఏదైనా అవగాహన ఉంటుందా? అని నిలదీశారు.
diveneni
Andhra Pradesh
Amaravati

More Telugu News