Tamilnadu: ఎన్నికల్లో 79 ఏళ్ల బామ్మను గెలిపించిన యువత

  • తమిళనాడులో ఘటన
  • స్థానిక పోరులో బామ్మ విజయఢంకా
  • ప్రజల కోసం పనిచేస్తానన్న వృద్ధురాలు
ఆమె వయసు 79 ఏళ్లు.. అందరిలా కృష్ణారామా అనుకుంటూ ఇంట్లో కూర్చోలేదు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడాలన్న కోరికతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. తమ ప్రాంతానికి ఆమె మంచి చేస్తుందని అక్కడి యువత నమ్మారు. ఆమెను గెలిపించారు. తమిళనాడుకులోని మేలుర్ తాలూకాలోని అరిట్టపట్టికి జరిగిన స్థానిక ఎన్నికల్లో వీరమ్మాళ్ అళగప్పన్ అనే బామ్మ గెలిచింది.

ఆ ఎన్నికల్లో మొత్తం ఏడుగురు పోటీలో నిలిచారు. ప్రత్యర్థులందరినీ ఓడించిన బామ్మకు అధికారులు ఇందుకు సంబంధించిన సరిఫ్టికెట్ అందించారు. ఆమె 190 ఓట్ల తేడాతో గెలిచిందని ప్రకటించారు. 'గ్రామంలోని యువతే నన్ను గెలిపించారు. నా వయసుతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేస్తాను'  అని ఆమె తెలిపింది.
Tamilnadu
elections

More Telugu News