Bellamkonda Srinivas: సెంటిమెంట్ కారణంగానే ఆ కథను పక్కన పెట్టేశాము: హీరో బెల్లంకొండ శ్రీనివాస్

  • హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి క్రేజ్ 
  • తదుపరి సినిమా సంతోష్ శ్రీనివాస్ తో 
  • 'తెరీ' మూవీ రీమేక్ కాదని స్పష్టీకరణ  
'రాక్షసుడు' హిట్ కొట్టిన దగ్గర నుంచి కథల ఎంపిక విషయంలో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. మంచి కథ కోసం ఆయన కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, "నా తదుపరి చిత్రం సంతోష్ శ్రీనివాస్ తో వుంది. ఈ సినిమా తమిళ మూవీ 'తెరీ'కి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు.

పవన్ తో సంతోష్ శ్రీనివాస్ 'తెరీ' రీమేక్ చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు. అదే కథను ఆయన రవితేజతో చేయాలనుకున్నాడు. కొన్ని కారణాల వలన ఆదిలోనే ఆగిపోయింది. ఈ సెంటిమెంట్ కారణంగానే ఆ కథను పక్కన పెట్టేసి కొత్త కథను అనుకున్నాము. ఈ కథ చాలా కొత్తగా .. విభిన్నంగా ఉంటుంది. ఇంతవరకూ నేను చేయని పాత్ర .. నాకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.
Bellamkonda Srinivas
Santhosh Srinivas

More Telugu News