అవన్నీ నా పర్సనల్... మీరేమీ అడగవద్దు: గుత్తా జ్వాల
- తమిళ హీరోతో డేటింగ్ లో ఉన్నట్టు న్యూస్
- విష్ణు విశాల్ పై మాట్లాడేందుకు నిరాకరణ
- అది వ్యక్తిగతమంటూ దాటవేత
నిన్న రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీ అధికారిక వెబ్ సైట్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, అదే కార్యక్రమంలో జ్వాల పాల్గొంది. ఆపై మీడియాతో మాట్లాడిన ఆమె, విష్ణు విశాల్ తో సంబంధం తన వ్యక్తిగతమని, దాని గురించి ఏమీ ప్రశ్నించవద్దని మీడియాపై చిర్రుబుర్రులాడింది.
ఇండియాకు చాంపియన్ లను అందించాలనే టార్గెట్ తో తాను అకాడమీని స్థాపించానని చెప్పిన జ్వాల, సువిశాలమైన ప్రాంతంలో, అత్యున్నత ప్రమాణాలతో 14 బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేశామని వెల్లడించింది. నిపుణులైన విదేశీ కోచ్ లు, ఫిజియోథెరపిస్టుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.