Rajasthan: మాట వినలేదని ఆడపులిని కొరికి చంపిన మగపులి!

షార్ట్స్‌లో చూడండి
ఓ ఆడపులిని మగపులి దారుణంగా చంపేసిన ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ బయోలాజికల్ పార్క్ లో నిన్న జరిగింది. ఇక్కడి సజ్జన్ ఘడ్ అనే పార్కులో దామిని అనే ఆడపులి, కుమార్ అనే మగపులి ఉన్నాయి. కుమార్ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండేది. దామిని చాలా సౌమ్యం. దీంతో కుమార్ ను ఆడపులి పక్కనే ఉన్న స్పెషల్ ఎన్ క్లోజర్ లో అధికారులు ఉంచారు.

ఈ క్రమంలో రెండు పులుల మధ్యా ఏం జరిగిందో ఏమోగానీ, అడ్డుగా ఉన్న వైర్లను తెంపిన కుమార్, బలవంతంగా దామిని ఉన్న ఎన్ క్లోజర్ లోకి వచ్చింది. బలమైన ఇనుప తీగలను తెంపిన క్రమంలో కుమార్ కు గాయాలు అయ్యాయి. ఆపై ఆడపులి దామిని పీక కొరికిన కుమార్, దాని మరణానికి కారణమైంది. ఈ విషయాన్ని వెల్లడించిన పార్కు అధికారి జీవీ రెడ్డి, ఆడపులి కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు తెలిపారు.
Go Back to Shorts
Rajasthan
Tiger
Kumar
Damini

More Telugu News