UK: అట్టపెట్టెల్లో డబ్బు... చెత్తగా భావించి పారేశారు!

షార్ట్స్‌లో చూడండి
లండన్ లోని బర్న్ హామ్ ఆన్ సీ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. పనికిరాని అట్టపెట్టెలు అని పారవేస్తే, రీసైక్లింగ్ సిబ్బందికి వాటిలో కళ్లు చెదిరేంత డబ్బు కనిపించింది. ఇటీవలే ఓ వ్యక్తి మరణించగా, అతని బంధువులు ఆ వ్యక్తి ఇంటిని శుభ్రపరిచేందుకు వచ్చారు. వారికి రెండు పాత అట్టపెట్టెలు కనిపించాయి. అయితే వాటిని చెత్తగా భావించిన వారు బయట పారేశారు.

వాటిని సేకరించిన రీసైక్లింగ్ సిబ్బంది తెరిచి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో రూ.14 లక్షల నగదు ఉంది. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ వ్యక్తి బంధువులను గుర్తించి, వారికి నగదు పెట్టెలను అందించారు. తాము వాటిని పనికిరానివిగా భావించి పారేశామని, తమ బంధువు డబ్బును ఆ పెట్టెల్లో దాచి ఉంచాడన్న విషయం ఇప్పుడే తెలిసిందని ఆ బంధువులిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
UK
London
Money
Pounds
Police

More Telugu News