Nara Lokesh: లోకేశ్ మాటలే కాదు, అతడ్ని చూస్తేనే నవ్వొస్తుంది: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

  • కేటీఆర్ ను పొగుడుతూ లోకేశ్ పై విమర్శలు
  • కేసీఆర్ కు రత్నంలాంటి కొడుకుపుట్టాడని వ్యాఖ్యలు
  • చంద్రబాబుకు లోకేశ్ వంటి కొడుకు పుట్టాడని వ్యంగ్యం
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్ మాటలు వింటేనే కాదు, అతడ్ని చూస్తేనే నవ్వొస్తుందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు రత్నంలాంటి కేటీఆర్ పుడితే, చంద్రబాబుకు మాత్రం లోకేశ్ వంటి కొడుకు పుట్టాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తర్వాత సీఎం పదవిని చేపట్టేందుకు కేటీఆర్ అన్నివిధాలా అర్హుడని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే విషయంలో కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
Nara Lokesh
KTR
Errabelli
Telangana
Andhra Pradesh
KCR
Chandrababu
Telugudesam
TRS

More Telugu News