Chandrababu: రాజధాని అమరావతికి గత ప్రభుత్వం చేసింది ఇవి!: ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు

  • 2014-19 మధ్య 1513 మంది రైతుల ఆత్మహత్యలు
  • టీడీపీ నేతలు, రియల్టర్స్ రాజధానిలో భూములు అక్రమంగా లాక్కున్నారు
  • అమరావతికి గత ప్రభుత్వం చేసింది గ్రాఫిక్స్, ఇన్ సైడర్ ట్రేడింగే
ఏపీలో గత ప్రభుత్వ పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించడమే కాకుండా విమర్శలు, ఆరోపణలు చేశారు. 2014-19 మధ్య 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు, రియల్టర్స్ అమరావతిలో ఎస్సీ, ఎస్టీలు, రైతుల నుంచి అక్రమంగా భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతికి గత ప్రభుత్వం చేసింది ఏదైనా ఉందంటే.. అది భూ సేకరణ కుంభకోణం, ఇన్ సైడర్ ట్రేడింగ్, గ్రాఫిక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై వ్యాఖ్యలు చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
Chandrababu
Telugudesam
YSRCP
Vijayasaireddy

More Telugu News