తన రికార్డు బద్దలుకొట్టే అవకాశం ఎవరికుందో చెప్పిన బ్రియాన్ లారా
- 400 పరుగులతో లారా వరల్డ్ రికార్డు
- ఇప్పటికీ చెక్కుచెదరని ఘనత
- వార్నర్, కోహ్లీ, రోహిత్ లకు చాన్సుందన్న లారా
ఓపెనర్ గా వచ్చే వార్నర్ కు ఇది సాధ్యమేనని అన్నాడు. కోహ్లీ క్రీజులో నిలదొక్కుకుంటే అతడ్ని ఆపడం ఎంతో కష్టమని లారా అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ గురించి చెబుతూ తనదైన రోజున ఏమైనా చేయగలడని తెలిపాడు. స్టీవ్ స్మిత్ కూడా మంచి బ్యాట్స్ మన్ అయినా, అతడు నాలుగోస్థానంలో వచ్చి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం కొంచెం కష్టమైన విషయమేనని లారా అభిప్రాయపడ్డాడు.