Andhra Pradesh: ప్రజాసమస్యల పరిష్కారం మా సంకల్పం.. మాది సంక్షేమ ప్రభుత్వం: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • వైసీపీపై, జగన్ పై విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు
  • ‘నీతి ఆయోగ్’ ఇచ్చిన ర్యాంకింగ్స్ గురించి ప్రస్తావన
  • ఏపీ 3వ స్థానంలో నిలవడాన్ని గుర్తుచేసిన విజయసాయిరెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారం తమ సంకల్పం అని, తమది సంక్షేమ ప్రభుత్వం అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీపై, సీఎం జగన్ పై విశ్వాసం ఉంచిన ఏపీ ప్రజలందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. సంక్షేమ పాలన ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ సంకల్పం అని ఓ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం ప్రవేశించడానికి ముందు వెలువడ్డ నీతి ఆయోగ్ నివేదిక గురించి ప్రస్తావించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ర్యాంకింగ్స్ లో ఏపీ మూడో స్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
Andhra Pradesh
YSRCP
mp
Vijayasaireddy

More Telugu News