Naresh: స్పాట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన మా అధ్యక్షుడు నరేశ్

  • మా డైరీ ఆవిష్కరణ
  • బయటపడ్డ విభేదాలు
  • చిరంజీవి, మోహన్ బాబు సాక్షిగా రాజశేఖర్ ఆవేశం
  • స్పందించిన మా అధ్యక్షుడు నరేశ్
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో వర్గ భేదాలు మరోసారి బయటపడ్డాయి. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ అన్నట్టుగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై మా అధ్యక్షుడు నరేశ్ ఘాటుగా స్పందించారు. బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు చేస్తే కఠినచర్యలు తప్పవని అన్నారు. అంతేకాకుండా, వివాదాలపై తక్షణ చర్యల కోసం స్పాట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

మాలో ఎలాంటి సమస్యలున్నా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు వ్యాఖ్యలు చేయకుండా, తక్షణం కమిటీకి తెలియజేయాలని స్పష్టం చేశారు. జీవితను తాను సోదరిలా భావిస్తానని, మాలో లేకపోయినా అందరం ఒక్కటిగానే ఉంటామని అన్నారు. భారతదేశంలో ఇన్ని మతాలు, కులాలు కలిసిమెలిసి సాగుతున్నప్పుడు తాము కలిసి పనిచేయడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు.
Naresh
Tollywood
MAA
Rajasekhar
Chiranjeevi
Mohanbabu
Jeevitha

More Telugu News