Amaravathi: జగన్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది: టీడీపీ ఎంపీ కనకమేడల

షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని అమరావతిపై అపోహలు సృష్టించి ఎడారి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రాజధాని ఏర్పాటు- కొనసాగింపు’, సెక్రటేరియట్ ఏర్పాటు-ఉద్యోగుల తరలింపు’, ’హైకోర్టు ఏర్పాటు- తరలింపు’, ’భవనాల నిర్మాణం- కొనసాగింపు’ వంటి అంశాలన్నీ కూడా నిర్ణయమైపోయాయని, వాటిని ‘డిస్టర్బ్’ చేయడం, అభద్రతాభావంతో కూడిన అంశాలను సృష్టించి, పరిష్కారం కోసం వెదుక్కోవడం సరైనటువంటి ప్రక్రియ కాదని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. ఎక్కడైనా సమస్యలను పరిష్కరించుకుంటారు కానీ వాటిని సృష్టించరని, జగన్ ప్రభుత్వం అదే పని చేస్తోందని, రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుకోవడం కరెక్టు కాదని హితవు పలికారు.
Go Back to Shorts
Amaravathi
jagan
Kanakamedala Ravindra Kumar

More Telugu News