Krishnamraju: వివాదాలను బహిర్గతం చేసుకోవద్దు: కృష్ణంరాజు హితవు

  • హైదరాబాదులో మా డైరీ ఆవిష్కరణ
  • పార్క్ హయత్ హోటల్ లో కార్యక్రమం
  • హాజరైన కృష్ణంరాజు
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదట తాము చెన్నైలో తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామని, దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు ఆరు బస్సులలో అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేసుకున్నారు. ఇవాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

తాజాగా సభలో జరిగిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయని, తమవంటి పెద్దలను పిలిచి సామరస్య ధోరణిలో పరిష్కరించుకోవాలని హితవు పలికారు. వివాదాలను బహిర్గతం చేసుకోరాదని, 'మా' గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. వివాదాల పరిష్కారం కోసం ఓ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు.
Krishnamraju
Tollywood
MAA
Hyderabad
Chiranjeevi
Rajasekhar

More Telugu News