YSRCP: పవన్ రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకోవాలి: వైసీపీ నేత జక్కంపూడి రాజా సలహా

  • రాష్ట్ర పరిస్థితులపై పవన్ కల్యాణ్ కు అవగాహన లేదు
  • పవన్ తన యాక్టింగ్ ను ఆపేయాలి
  • అమరావతిలో రైతులకు ఎవరూ ఇబ్బంది కలిగించొద్దు
అమరావతిలో రైతులకు ఎవరూ ఇబ్బంది కలిగించొద్దని వైసీపీ నేత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సూచించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆందోళనకు గురవుతున్నారని విమర్శించారు. వారిద్దరూ రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలను చేస్తున్నారన్నారు.

రాజధాని రైతులకు పూర్తి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని జక్కంపూడి ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు, పవన్ లు తమ వైఖరిని మార్చుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితులపై పవన్ కల్యాణ్ కు అవగాహన లేదంటూ.. పవన్ తన యాక్టింగ్ ను ఆపేయాలని పేర్కొన్నారు. పవన్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.
YSRCP
Jakkampudi Raja
criticism
Pawan Kalyan
Amaravati
Capital issue
Andhra Pradesh

More Telugu News