Telangana: కొత్త సంవత్సర వేడుకల్లో భారీగా మద్యం తాగేశారు

  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెరిగిన విక్రయాలు
  • డిసెంబర్ 30, 31 తేదీల్లో దాదాపుగా రూ.380కోట్ల విక్రయాలు!
  • మద్యం ధరలు 10శాతం పెరిగినా.. అమ్మకాలపై ప్రభావం నిల్

తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరుల్లో లిక్కర్ ముందు వరుసలో వున్న విషయం తెలిసిందే. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం షాపులకు రాత్రి ఒంటగంటివరకు తెరిచివుంచేందుకు అనుమతి ఇవ్వడంతో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. మందుబాబులు వేడుకలకు అంతే లేకుండా పోయింది. మరోవైపు మద్యం షాపులకు కాసుల వర్షం కురిసింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిసెంబర్ 30, 31 తేదీల్లో అత్యధిక స్థాయిలో దాదాపు రూ.380 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం సాధారణ రోజుల్లో అయితే రోజుకు రూ.60 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయని సమాచారం. ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలను 10 శాతం మేర పెంచినప్పటికీ.. విక్రయాలపై దాని ప్రభావమేమీ పడలేదు. మద్యం తాగేవారి సంఖ్య కూడా పెరిగిందని తెలుస్తోంది. పెంచిన ధరలతో మొత్తం లిక్కర్ రెవెన్యూపై రూ.300 నుంచి రూ400 కోట్లు ఎక్సైజ్ శాఖకు అదనంగా సమకూరనుంది. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వానికి రూ.20 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

More Telugu News