Errabelli: చంద్రబాబు కొడుకు లోకేశ్ లా కేటీఆర్ అసమర్థుడు కాదు: ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ రూరల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ లా, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీలా కేటీఆర్ అసమర్థుడు కాదని ఆయన చెప్పుకొచ్చారు.

సీఎం కావడానికి కేటీఆర్ అన్ని విధాల సమర్థుడని ఎర్రబెల్లి తెలిపారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తమ పార్టీ అన్ని ఎన్నికల్లో విజయం సాధించిందని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం దేశంలో ప్రభుత్వాన్ని నడపిందని వ్యాఖ్యానించిన ఆయన.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించొద్దని నిలదీశారు.
Go Back to Shorts
Errabelli
KCR
KTR

More Telugu News