తిరుమల ఖాళీ... గంటలోనే దర్శనం!
- తగ్గిన న్యూ ఇయర్ హడావుడి
- వైకుంఠ ఏకాదశికి ఐదు రోజుల సమయం
- మూడు కంపార్టుమెంట్లలోనే భక్తులు
ఇక టైమ్ స్లాట్, ప్రత్యేక, దివ్య దర్శనం టోకెన్లు కలిగివున్న భక్తులకు గంట నుంచి రెండు గంటల్లోపు దర్శనం చేయిస్తున్నారు. బుధవారం స్వామివారికి హుండీ ద్వారా రూ. 3.93 కోట్ల ఆదాయం లభించింది. దాదాపు 95 వేల మంది స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వారాంతం వరకూ భక్తుల రద్దీ సాధారణంగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, ఆపై వైకుంఠ ఏకాదశి నుంచి రద్దీ పెరుగుతుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.